అనారోగ్య బారిన పడ్డ చలాకీ చంటి..!

-

చాలా కాలం పాటు బుల్లితెరపై తన కామెడీ డైలాగులతో ప్రేక్షకులను బాగా అలరించిన జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన చంటి ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ ఏ షో లో కూడా పెద్దగా కనిపించలేదు. గతంలో కమెడియన్ గా ఎన్నో చిత్రాలలో నటించిన చలాకీ చంటి జబర్దస్త్ స్టేజ్ ను బాగానే ఉపయోగించుకున్నారు. అలా బుల్లితెరపై స్టార్ కమెడియన్ గా ఎదిగారు చలాకి చంటి.

వెండితెరపై కూడా ఎన్నో అవకాశాలను అందుకున్నారు. కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు చంటి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. చలాకీ చంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవైపు షోలో టీం లీడర్ గా చేస్తూనే మరొకవైపు పలు సినిమాలలో కమెడియన్ గా పలు పాత్రలు చేశారు. చలాకీ చంటి తాజాగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారని.. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలు కారణంగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని వార్తలు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.

గత ఏడాది టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న చంటి బిగ్ బాస్ చివరి వరకు ఉండలేకపోయారు. కేవలం కొన్ని వారాలకే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత పెద్దగా బుల్లితెరపై కనిపించలేదు. అడపాదప షోలలో చేస్తూ ఉన్న చలాకీ చంటి పూర్తిగా స్క్రీన్ కు దూరం అవ్వడంతో దీంతో ఆయన అభిమానులు చలాకి చంటి కి ఏమైందో అంటూ కంగారుపడుతున్నారు. ఇలాంటి సమయంలోనే చలాకీ చంటి హాస్పిటల్లో చేరాను అని వార్త వినగానే అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈయనకి అసలు ఏమైందని విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news