బ్రేకింగ్‌: హైకోర్టులో రజనీకాంత్‌కు చుక్కెదురు..!

-

త‌ళైవ‌, త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌పై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. కోర్టు విలువైన స‌మ‌యాన్ని వృథా చేశార‌ని మంద‌లించింది. వివ‌రాల్లోకి వెళ్తే… తన కళ్యాణ మండపానికి చెన్నై కార్పొరేషన్‌ విధించిన ఆస్తి పన్నును తగ్గించేలా, ఎలాంటి అపరాధ రుసుము విధించకుండా ఉత్తర్వులు జారీ చేయాలని ఇటీవ‌ల సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. అయితే రజనీకాంత్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు తీవ్ర ఆగ్రహం, అస‌హ‌నం వ్యక్తం చేసింది. కోర్టు విలువైన సమయా న్ని వృథా చేసేలా దాఖలైన ఈ పిటిషన్‌పై జరిమానా విధించాల్సివస్తుందని న్యాయమూర్తి తీవ్రంగా హెచ్చరించారు. దీంతో రజనీకాంత్ తరఫు న్యాయవాది ఈ కేసును ఉపసంహరించుకోవ‌డం గ‌మ‌నార్హం.

చెన్నైలోని కోడంబాక్కంలో రజనీకాంత్‌కు కల్యాణ మండపం ఉంది. కరోనా వైర‌స్ నియంత్ర‌ణ‌లో భాగంగా లాక్‌డౌన్ విధించిన కారణంగా గత ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు దాన్ని మూసివేశారు. ఈ నేపథ్యంలో ఆస్తి పన్నును తగ్గించాలని కోరుతూ సూప‌ర్‌స్టార్ రజ‌నీకాంత్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అనితా సుమంత్‌ ఎదుట విచారణకు వచ్చింది. అయితే హైకోర్టు తీర్పుపై సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news