బ్రేకింగ్ : వివేకా హత్య కేసులో రంగంలోకి కొత్త సీబీఐ బృందం

-

ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గత ఏడాది ఎన్నికల ముందు హత్యకు గురయిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుని పోలీసులు ఏమీ తేల్చకుండా ఉండడంతో ఆయన కుమార్తె సీబీఐని ఆశ్రయించింది. దీంతో ఈ ఏడాది జూలై 9న సీబీఐ కేసు నమోదు చేసింది. ఇక ఈ కేసులో దర్యాప్తు బాధ్యతలను ఢిల్లీ లోని ప్రత్యేక నేరాల విభాగం మూడవ బ్రాంచికి అప్పగించారు. వివేకా కుమార్తె పిటీషన్ పై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తు బాధ్యతలు చేపట్టినట్లు ఎఫ్ఐఆర్ లో సీబీఐ పెర్కొంది.

వివేకా కేసు పై దర్యాప్తు అధికారిగా ప్రత్యేక నేరాల విభాగం మూడవ బ్రాంచి డీఎస్పీ దీపక్ గౌర్ నియామకం అయ్యారు. అయితే ప్రస్తుతం సీబీఐ అధికారులకు కరోనా నేపథ్యంలో విచారణ తాత్కాలికంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. తొలుత వివేకా మృతిని సీఆర్పీసీ 174 సెక్షన్ (మృతికి కారణం తెలియదంటూ) కింద కేసు నమోదు చేసిన పోలీసులు, అనంతరం ఐపీసీ సెక్షన్ 302 (హత్యానేరం) కింద రిజిస్టర్ చేశారు. అయితే ఇప్పుడు విచారిస్తోన్న బృందంలో కొందరు అధికారులకి కరోనా సోకడంతో త్వరలొ కొత్త బృందం రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news