చిరంజీవి 152 మూవీ టైటిల్ ‘ఆచార్య’.. నోరు జారిన చిరంజీవి

-

సైరా నరసింహారెడ్డి సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ ని ఆచార్య గా ఖరారు చేసింది చిత్ర యూనిట్. ఈ ఏడాది ద్వితియార్దంలో విడుదల కానున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్ గా పలు భాషల్లో ఈ సినిమా విడుదుల కానుంది. ఇటీవల ఈ సినిమాలో చిరంజీవి లుక్ కూడా బయటకు వచ్చింది.

ఆ పిక్ లో ఆయన మావోయిస్ట్ గా కనిపించడంతో పాటుగా బాగా సన్నబడ్డారు. దీనితో సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సైరా ఫ్లాప్ తర్వాత చిరూ చేస్తున్న చిత్రం కావడం, ఈ సినిమాలో మహేష్ బాబు కూడా నటిస్తారు అనే వార్తలు రావడంతో సినిమా గురించి ఏ వార్త వచ్చినా ఆశక్తిగా సినీ జనం చూస్తున్నారు. ఈ సినిమా టైటిల్ గోవింద ఆచార్యగా ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. ఇక టైటిల్ ఖరారు కావడంతో ఫస్ట్ లుక్ కోసం మెగా అభిమానులు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news