మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 152వ సినిమా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని పనులు పూర్తిచేసి కొరటాల సిద్దంగా ఉన్నాడు. చిరు కారణంగా సెట్స్ కు వెళ్లడం ఆలస్యమవుతోంది. సైరా నరసింహారెడ్డి రిలీజ్ తర్వాత మొదలు పెడతారా? ముందే సెట్స్ కు వెళ్తారా? అన్న దానిపై ఇంకా సరైన క్లారిటీ రాలేదు. చిరు సరసన హీరోయిన్ ఎంపికపై సందిగ్ధత కొనసాగుతోంది. చాలా మంది సీనియర్ భామల్ని పరిశీలించినప్పటికీ చిరు ఇమేజ్ కు సరితూగట్లేదని ఫీలవుతున్నారు. దీంతో ఏకంగా బాలీవుడ్ నుంచి ఐశ్వర్యరాయ్ నే దించాలని కొరటాల ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.
దీనిపైనా యూనిట్ వివరణ ఇవ్వాల్సి ఉంది. తాజాగా కొరటాల సన్నిహిత వర్గాల నుండి సినిమా షూటింగ్ అప్ డేట్ ఒకటి తెలిసింది. ముందుగా రెగ్యులర్ షూటింగ్ ను శ్రీకాకుళం జిల్లా పలాస లో మొదలు పెట్టబోతున్నారుట. తొలి షెడ్యూల్ లో భాగంగా అక్కడ నెల రోజుల పాటు ఏకధాటిగా షూటింగ్ చేయనున్నారుట. దీంతో అక్కడి నేపథ్యం గల సన్నివేశాలకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అర్ధమవుతోంది. మెగాస్టార్ తో నెల రోజుల పాటు పలాస లో షూటింగ్ అంటే చిన్న విషయం కాదు. సాధారణంగా నెల రోజుల షూటింగ్ విదేశాల్లోనూ..ఇతర రాష్ర్టాల్లోనూ పెట్టుకుంటారు. లేదంటే హైదరాబాద్ లోనే ప్రత్యేకంగా తాము అనుకున్న వాతావరణాన్ని సెట్ల రూపంలో హైదరాబాద్ లో వేసి తీసుకొస్తారు.
అది కాదని కొరటాల మరీ పలాసలోనే షూట్ చేయాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది. చిరుతో పలాసలో ఇంత లాంగ్ షెడ్యూల్ అంటే సెక్యూరిటీ సమస్యలు ఎదురవుతాయి. మారుమూల ప్రాంతం కాబట్టి అభిమానులు చిరును చూడటానికి భారీ ఎత్తున తరలి వచ్చే అవకాశం ఉంది. పైగా చిరు మాజీ రాజకీయనాయకుడు కాబట్టి ఇతర సమస్యలు ఉంటాయి. అలాంటి సమయంలో భద్రతా సమస్యలు తప్పవు. ఉన్న సినిమా సిబ్బంది, సెక్యూరిటీతో కంట్రోల్ చేయడం అసాధ్యం . అందుకే తాత్కిలికంగా ఆ షెడ్యూల్ పూర్తయయ్యే వరకూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిని అదనంగా చిరు కోసం పంపించబోతున్నారని తెలిసింది.