రాజకీయాల్లో హుందాతనం ఉండాలి…రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు తగవు…ప్రస్తుత రాజకీయాలు వ్యక్తిగత విమర్శలతో నడుస్తున్నాయని చిరంజీవి పేర్కొన్నారు. వ్యక్తిగత విమర్శల వల్లే నేను రాజకీయాల నుంచి బయటకు రావాల్సి వచ్చిందని…దుర్భాషలు, వ్యక్తిగత విమర్శలు చేసే వాళ్లకు తిప్పికొట్టే విధంగా ప్రజలు నిర్ణయం తీసుకోవాలని కోరారు. శిల్పకళావేదికలో పద్మ అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమం చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేశారు.
కళను గుర్తించి అవార్డులు ఇవ్వడం కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోడీకి ధన్యవాదాలు చెప్పారు. పద్మశ్రీ అవార్డులు బడుగు బలహీన వర్గాల పేర్లను ముందుగా ఇవ్వాలని చెప్పిన ఆలోచన మోడీదేనని.. సామాజిక సేవ చేసే భాధ్యత ఆర్టిస్ట్ లు స్వయంగా రావాలని పేర్కొన్నారు. నా అభిమానులు నాకోసం ప్రాణాలు కాదు – రక్తం ఇవ్వాలని కోరారు. నేను అవార్డుల కోసం ఎదురు చూడను, అవార్డులు రావాలని కోరుకోనన్నారు. ఈ అవార్డులు ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు చిరంజీవి.