కిషన్ రెడ్డి చేతుల మీదుగా రేపు ఏపీగ్రఫీ మ్యూజియానికి శంకుస్థాపన

-

దేశంలోనే తొలి ఎపిగ్రఫీ మ్యూజియం మన భాగ్యనగరంలో ఏర్పాటుకానుంది. రేపు (ఫిబ్రవరి 5వ తేదీ, సోమవారం) గౌరవ కేంద్ర మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఈ మ్యూజియానికి శంకుస్థాపన జరగనుంది. భారత పురాతత్వ శాఖ (ASI) హైదరాబాద్ విభాగం ఆధ్వర్యంలో ఈ మ్యూజియం ఏర్పాటు కానుంది. రేపు (సోమవారం) ఉదయం 10.30 గంటలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సాలార్జంగ్ మ్యూజియంలోని వెస్టర్న్ బ్లాక్‌ వద్ద ఎపిగ్రఫీ మ్యూజియానికి శంకుస్థాపన చేస్తారు.

2023-24 బడ్జెట్‌లో Bharat-SHRI ఏర్పాటుచేస్తామని ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించగా.. కేంద్ర సాంస్కృతిక మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి.. ఈ మ్యూజియం హైదరాబాద్ కు కేటాయించేలా ప్రత్యేక చొరవతీసుకున్నారు.లక్షకు పైగా ప్రాచీన శిలాశాసనాలు, లోహాలపై, చెక్కలపై చెక్కిన శిల్పాలను, వాటి డిజిలటీకరణ పూర్తిచేసి ఈ ఎపిగ్రఫీ మ్యూజియం ద్వారా సందర్శకులకు అందుబాటులో ఉంచుతారు. మల్టీ మీడియా ద్వారా సందర్శకులు ఆయా శాసనాల్లోని అంశాలను తెలుసుకోవచ్చు.భారతదేశంలో రాత, శాసనాల పుట్టుపూర్వోత్తరాలు మొదలుకుని, వివిధ భారతీయ భాషల్లో మన పూర్వీకులు ఇచ్చిన సందేశాలు, పేర్కొన్న అంశాలు, వివిధ రాజుల సమయాల్లోని విశేషాలు.. వంటివెన్నో ఈ ఎపిగ్రఫీ మ్యూజియం సందర్శన సందర్భంగా అనుభవంలోకి రానున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version