నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ లో ఘనంగా స్వర్ణోత్సవ వేడుకను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1వ తేదీన ఈ వేడుక ఘనంగా జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ సెలబ్రేషన్స్ నిర్వహించే బృందంతో పాటు టీఎఫ్పీసీ, మా అసోసియేషన్ సభ్యులు ఈ వేడుకకు గెస్టులను ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా వీళ్లు మెగాస్టార్ చిరజీవిని కలిసారు. బాలకృష్ణ గోల్డెన్ జాబ్లీ వేడుకలకు రావాలని ఆయణ్ను ఆహ్వానించారు. చిరంజీవిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. వీరి ఆహ్వానాన్ని మన్నించిన చిరు.. ఈవెంట్ కు వస్తానని మాటిచ్చినట్లు సమాచారం.
1974లో తాతమ్మ కల అనే చిత్రంలో బాలయ్య తన సినీ కెరీర్‌ను ప్రారభించారు. అప్పటి నుంచి వందలాది చిత్రాలు. భారీ సంఖ్యలో అవార్డులతో తెలుగు చిత్ర పరిశ్రమలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆయన డైరెక్టర్ బాబీతో కలిసి #NBK 109 మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే రాజస్థాన్‌లో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ తాజాగా తదుపరి షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించనున్నట్లు సమాచారం.