చిరంజీవిపై తన భార్యకు అనుమానం.. ఊహించని బహుమతితో మెగాస్టార్ సర్‌ప్రైజ్..

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి అందరికీ విదితమే. ఆయన నటించిన ‘ఆచార్య’ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. కాగా, చిరంజీవి తాజాగా చేసిన ఓ కమర్షియల్ యాడ్ విడుదలై యూట్యూబ్ లో వైరలవుతోంది. సదరు యాడ్ కు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించడం విశేషం.

‘శుభగృహ’ రియల్ ఎస్టేట్ వారి కోసం ఈ యాడ్ రూపొందించారు. ఇందులో చిరంజీవి, కుష్బు జంటగా నటించారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా అనసూయ భరద్వాజ్ నటించింది. చక్కటి నటనతో చిరంజీవి ఇందులోనూ చించేశారని యాడ్ చూసిన సినీ లవర్స్, మెగా అభిమానులు అంటున్నారు. తన భార్య రేఖ పుట్టిన రోజు సందర్భంగా సర్ ప్రైజ్ చేయాలని చిరు అనుకుంటారు.

ఈ క్రమంలోనే తన ఫ్రెండ్ గౌతమ్ ఫోన్ చేశాడని ఇంటి నుంచి హడావిడిగా బయలుదేరుతాడు చిరు. అయితే, ఇంత హడావిడి ఎందుకని రేఖ (ఖుష్బు) అనుమానపడుతుంది. చిరును ఫాలో అవుతుంది. వారు శుభగృహ ఆఫీసుకు వెళ్లగా, ఈ రోజు తన భార్య రేఖ పుట్టిన రోజని, సొంతిల్లు తన కల అని, అది సాకారం ఈ రోజు చేయాలనుకుంటున్నానని చిరు చెప్తాడు. శుభ గృహ వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన ఇంటిపత్రాలను తన భార్య రేఖ బర్త్ డే సందర్భంగా చిరు అందజేస్తాడు. అలా కథ సుఖాంతమవుతుంది.

సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాడ్ లో చిరంజీవి, అనసూయ భరద్వాజ్, ఖుష్బు నటించారు. ఈ కమర్షియల్ యాడ్ లో చిరంజీవి, ఖుష్బులు సీనియర్ నటీ నటుల్లా కాకుండా ఇంకా యంగ్ గా కనబడుతున్నారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అనసూయ భరద్వాజ్, ఖష్బులు చీరకట్టులో ఉంగా, వారిని మించిన ప్రొఫెషనల్ లుక్ లో చిరంజీవి ఇంకా స్టైలిష్ గా కనిపించారని మెగా అభిమానులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version