సింగపూర్ లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు చదువుతున్న స్కూల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలు అయ్యాయి. మార్క్ శంకర్ కు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మన్యం పర్యటన ముగించుకొని సింగపూర్ వెళ్లనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

ఇక సింగపూర్ లోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు చదువుతున్న స్కూల్ లో అగ్ని ప్రమాదం పై చిరంజీవి స్పందించారు. పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలపై స్పందించిన మెగాస్టార్ చిరంజీవి.. 8 ఏళ్ల మార్క్ శంకర్ ప్రస్తుతం బాగానే ఉన్నాడన్నారు. కాళ్లకు స్వల్ప గాయాలయ్యాయి అని వెల్లడించారు చిరంజీవి.