డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హుటాహుటిన సింగపూర్ పయనం అయ్యారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలయ్యాయి. సింగపూర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడికి గాయాలయ్యాయి. ఆయన చిన్న కుమారుడు మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలైనట్లు సమాచారం.

మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూల్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చేతులు, కాళ్ళకు గాయాలయ్యాయి. అదే విధంగా ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు లోనయ్యాడు. మార్క్ శంకర్ ను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ గారికి ఈ విషయం తెలిసింది. దీంతో అల్లూరి జిల్లా పర్యటన ముగించుకుని పవన్ సింగపూర్ వెళుతున్నారు.