కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు ఐంది. లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ అరెస్ట్ అయ్యారు. గత రెండు వారాలుగా చంచల్గూడా జైల్లో ఉన్న జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు ఐంది.
జానీ మాస్టర్ పై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది లేడీ కొరియోగ్రాఫర్. దింతో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలు పాలు అయ్యారు. ఇక అటు జానీ మాస్టర్ చాలా మంచివాడు అని తెలిపారు అనీ మాస్టర్. జానీ మాస్టర్ కేసు విషయం విని షాక్ అయ్యాను.. వారంపాటు ఏం తోచని స్థితిలో ఉన్నానని తెలిపారు. అన్నీ తెలుసుకున్న తర్వాతే మీడియా ముందు మాట్లాడదాం అని ఈరోజు ముందుకు వచ్చానని వివరించారు. జానీ మాస్టర్ కి వచ్చిన నేషనల్ అవార్డు కూడా వెనక్కి తీసుకోవడం బాధాకరమన్నారు.