టాలీవుడ్లో ఈ సంక్రాంతికి గట్టి ఫైట్ నెలకొంది. దీంతో చాలా సినిమాలు క్రిస్మస్‌కు రావాలని అనుకున్నాయి. అంతలోనే మళ్లీ కొన్ని సినిమాలు వెనక్కు వెళ్లక తప్పలేదు. క్రిస్మస్‌కు ఎన్నో సినిమాలు అనుకున్నారు. కానీ చాలా సినిమాలు తప్పుకున్నాయి. కేవలం 2 మాత్రమే క్రిస్మస్ బరిలో మిగిలాయి. వాటిలో ఒకటి బాలయ్య రూలర్ కాగా, రెండోది సాయిధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే. ఈ రెండు సినిమాలు డిసెంబర్ 20న వస్తున్నాయి. ఇప్పటికే అఫీషియల్‌గా రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. క్రిస్మస్ వారు ఈ రెండు సినిమాల మధ్యే అనుకుంటోన్న టైంలో ఇప్పుడు మూడో సినిమా కూడా వచ్చి చేరింది. దాని పేరు ఇద్దరి లోకం ఒకటే.
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయినా నిర్మాత రాజు సోలో రిలీజ్ కోసం వెయిట్ చేసి వెయిట్ చేసి చివరకు క్రిస్మస్‌కు దింపేస్తున్నాడట. క్రిస్మస్ సెలవులతో పాటు జనవరి 1 హాలిడే కూడా కలిసొస్తుంది… రెండు వీకెండ్స్ వరకు అంటే 10 రోజుల వరకు ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఎదురు ఉండదన్నదే దిల్ రాజు ప్లాన్.
వాస్తవంగా చూస్తే కొంత కాలంగా వరుసగా ఫ్లాపులు చూస్తున్న రాజ్ తరుణ్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. హీరోయిన్ గా నటిస్తున్న షాలినీ పాండే కూడా ఈ సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది. వీరిద్దరికి సరైన హిట్ వచ్చి ఏళ్లే గడిచాయి. ఇప్పుడు రాజ్ అటు బాలయ్యతో పాటు ఇటు సాయిధరమ్ సినిమాలకు పోటీగా తన సినిమాతో రావడం అంటే రిస్కే. మరి ఎంత దిల్ రాజు సపోర్ట్ ఉన్నా కంటెంట్‌లో దమ్ము లేకపోతే రాజ్‌దుమ్ము దుమ్ము అవ్వాల్సిందే. మరి బాలయ్య సైతం తన సినిమాకు పోటీగా వస్తోన్న ఈ ఇద్దరు యంగ్‌స్టర్స్‌ను ఎలా ఢీ కొడతాడో ? చూడాలి. ఇక కృష్ణ డైరక్ట్ చేసిన ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందించాడు.