తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీలోని సుప్రీంకోర్టులో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు పిటిషన్ సవాల్ చేస్తూ.. పెద్దిరాజు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. సరైన ఆధారాలు లేవని ఇవాళ సుప్రీంకోర్టు ఎన్ పెద్దిరాజుకి.. ఆయన తరపు న్యాయవాది రితేష్ పాటిల్ కి సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. గతంలో హైకోర్టులో కూడా ఇలా జరగడంతో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు కి వెళ్లారు.
2016లో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై నమోదైన ఆ కేసును హైకోర్టు గురువారం కొట్టేసింది. ఘటనా స్థలంలో రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా లేరని, ఆయనకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం సెక్షన్లు వర్తించవని స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ అనంతరం ఈ తీర్పు వెలువరించింది. తీర్పు ఇచ్చే ముందు.. పిటిషన్‌ను మరో హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించామని ఫిర్యాదుదారు ఎన్ పెద్దిరాజు తరఫు న్యాయవాది చెప్పారు.