అల్లు అర్జున్‌కు హగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి!

-

ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇవాళ గద్దర్ అవార్డ్స్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పుష్ప  2 సినిమాలో అద్భుతమైన నటనతో… గద్దర్ అవార్డు సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.  

CM Revanth and Allu Arjun on the same stage
CM Revanth and Allu Arjun on the same stage

ఈ నేపథ్యంలోనే… తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ కు అల్లు అర్జున్ కూడా వచ్చాడు. అల్లు అర్జున్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన  అగ్ర హీరోలు నందమూరి బాలయ్య,  తదితర హీరోలు కూడా రావడం జరిగింది. ఇక ఈ అవార్డుల ప్రధానోత్సవం… తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొనసాగనుంది. దీంతో ఆయన కూడా కాసేపటి క్రితమే ఈవెంట్ కు వచ్చారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను హగ్ చేసుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news