సినిమా ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలామంది ప్రముఖులు మరణించారు. అయితే తాజాగా ప్రముఖ కమెడియన్ మృతి చెందారు. కన్నడ చిత్ర పరిశ్రమకు సంబంధించిన హాస్యనటుడు బ్యాంకు జనార్దన్ తాజాగా మృతి చెందారు. 77 సంవత్సరాలు ఉన్న బ్యాంకు జనార్దన్ తీవ్ర అనారోగ్యంతో మరణించినట్లు తెలుస్తోంది.

ఇటీవల.. అనారోగ్యం కారణంగా బెంగళూరు మణిపాల్ ఆసుపత్రిలో… చికిత్స నిమిత్తం అడ్మిట్ అయ్యారట. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి గత రాత్రి విషమంగా మారిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో బ్యాంకు జనార్దన్ మరణించారట. ఇక ఇప్పటివరకు బ్యాంకు జనార్ధన్ దాదాపు 500 సినిమాలలో సందడి చేశారు. తెలుగులో ఖననం, రిధం, లాస్ట్ పెగ్, ఉపేంద్ర 2 ఇలాంటి సినిమాలు చేశారు బ్యాంకు జనార్ధన్. 1948లో జన్మించిన ఈయన తొలుత బ్యాంకులో పనిచేసే తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చాడు.