హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. హైదరాబాద్ పాతబస్తీలో రౌడీ షీటర్ హత్య జరిగింది. డబీర్ పురా ఫ్లై ఓవర్ వద్ద ఫలక్ నుమాకు చెందిన రౌడీ షీటర్ ను హత్య చేశారు దుండగులు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ ఫలక్నుమా రౌడీషీటర్ మాస్ యుద్ధీన్ దారుణ హత్య జరిగింది.

రెయిన్ బజార్లో మాస్ యుద్ధీన్ను కత్తితో పొడిచి చంపారు దుండగులు.. మూడు రోజుల క్రితమే రౌడీ షీటర్ మాస్ యుద్ధీన్కి వివాహం అయింది.. ప్రత్యర్థులే యుద్ధీన్ను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు పోలీసులు.