కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్ కు క‌రోనా .. ఆరోగ్యం విష‌మం

ప్ర‌ముఖ కొరియోగ్రాఫర్‌ శివశంకర్‌ మాస్టర్ కరోనా బారిన పడ్డారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్యం విషమంగా ఉంది. శివ శంక‌ర్ మాస్ట‌ర్ కు కొద్ది రోజుల క్రితం కరోనా సోకింది. దీంతో ఆయ‌న‌ను హైద‌రాబాద్ న‌గ‌రం లో ని ఏఐజీ ఆస్ప‌త్రి లో చేరారు. శివ శంక‌ర్ మాస్ట‌ర్ తో పాటు ఆయ‌న భార్య‌కు, పెద్ద కుమారుడికి క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణ అయింది.

ఆయ‌న భార్య హోం క్వారంటైన్ లో ఉండ‌గా.. కుమారుడు మాత్రం అప‌స్మార‌క స్థితిలో ఉన్న‌ట్టు తెలుస్తుంది. కాగ శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు ఏఐజీ వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం శివ శంక‌ర్ మాస్ట‌ర్ హైద‌రాబాద్ న‌గ‌రం లో ని ఏఐజీ ఆస్ప‌త్రి లోని ఐసీయూ లో చికిత్స పొందుతున్నారు. శివ శంక‌ర్ మాస్ట‌ర్ కొరియో గ్రాఫ‌ర్ గా చాలా సినిమా ల‌కు ప‌ని చేశాడు. తెలుగు, త‌మిళం, హింది తో పాటు మొత్తం ప‌ది భాష‌ల సినిమా ల‌కు కొరియో గ్రాఫ‌ర్ గా ప‌ని చేశారు.