సామాజిక న్యాయం కోసమే కులగణన సర్వే చేపట్టామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో సర్వే వివరాలను వెల్లడించారు. బీసీ జనాభా లెక్కించాలనేది రాహుల్ గాంధీ కోరిక.. వెనుక బడితన తరగతుల వారికి న్యాయం చేయాలన్నది మా ఆకాంక్ష అని తెలిపారు. సర్వే 1లక్ష 3వేల 889 మంది పాల్గొన్నారు. భారతదేశ చరిత్రలో సామాజిక న్యాయం సాధించడంలో సర్వే ఉపయోగపడుతుందని తెలిపారు.
తెలంగాణ జనాభా 3కోట్ల 70లక్షల మంది ఉన్నారు. 96.9 మంది సర్వేలో పాల్గొన్నారని.. 3.1లక్షల మంది సర్వేకు అందుబాటులోకి రాలేదని తెలిపారు. ఇవాళ చారిత్రాత్మక రోజు అని తెలిపారు. 4వ తేదీ రోజు 10 గంటలకు సోషియో ఎకానమిక్ సర్వే క్యాబినెట్ లో ప్రవేశపెడతాం.. అలాగే శాసనసభలో ప్రవేశపెడతామని తెలిపారు. ఫిబ్రవరి 04, 2024లో క్యాబినెట్ లో తీర్మాణం చేశామని.. సంవత్సరం కాలంలో పూర్తి చేసామని తెలిపారు.