ఎప్పుడు వివాదాలలో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి వచ్చాడు. రెండు తెలుగు రాష్ట్రాల ను ఒక్కసారి భయబ్రాంతులకు గురి చేసిన పరువు హత్య నేపథ్యంలో తెరకెక్కుతున్న మర్డర్ సినిమా వివాదం కోర్టు కు చేరుకుంది. నల్గొండ జిల్లాలో ప్రణయ్ పరువు హత్య నేపథ్యంలో రాంగోపాల్ వర్మ మర్డర్ సినిమాను మొదలుపెట్టాడు. దీనికి అనుబంధంగా ఓ మోషన్ పిక్చర్ ను కూడా విడుదల చేశాడు. అయితే దీనిపై ప్రణయ్ భార్య అమృత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
తన క్లయింట్ రాంగోపాల్ వర్మకు కరోనా సోకినందున అఫిడవిట్ పై సంతకం చేయలేక పోయారని కోర్టుకు రాంగోపాల్ వర్మ తరఫున న్యాయవాది తెలిపారు. అయితే రామ్ గోపాల్ వర్మ కు కరోనా ఎప్పుడు వచ్చింది అనే విషయం ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. రాంగోపాల్ వర్మ కు పాజిటివ్ నిర్ధారణ అవ్వలేదని అమృత తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు అయితే దానికి సంబంధించిన ఆధారాలను మరుసటి వాయిదాల్లో కోర్టుకు సమర్పిస్తామని తెలిపారు.