మళ్లీ తెరపైకి ప్రభాస్‌ పెళ్లి వార్తలు.. స్పందించిన టీమ్‌

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పెళ్లి గురించి మరోసారి వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏపీలోని గణపవరానికి చెందిన అమ్మాయిని ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నాడంటూ కొన్ని రోజుల క్రితం న్యూస్ చక్కర్లు కొట్టింది. ఇప్పుడు అవే వార్తలు మరింత బలంగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ అమ్మాయి తండ్రి హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అని.. ఏపీకి చెందిన ఆ ఫ్యామిలీ నగరంలోనే సెటిల్ అయిందని వార్తలు వస్తున్నాయి.

అయితే పెళ్లి వార్తలపై ప్రభాస్ టీమ్ స్పందించింది. సోషల్ మీడియాలో డార్లింగ్ వివాహానికి సంబంధించి వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయొద్దని స్పష్టం చేసింది. వీటిని నమ్మొద్దని అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఇలాంటి న్యూస్ ఏదైనా ఉంటే ప్రభాస్ నేరుగా తన అభిమానులతో పంచుకుంటారని స్పష్టం చేసింది. ఇక ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మారుతితో రాజాసాబ్, హను రాఘవపూడితో ఫౌజీలో నటిస్తున్నాడు. ఇవే కాకుండా మరో నాలుగు సినిమాలు డార్లింగ్ చేతిలో ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version