జయప్రదను వెంటనే అరెస్ట్ చేయాలంటూ పోలీసులకు కోర్టు ఆదేశం

-

 ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే ఈఎస్​ఐకి సంబంధించిన కేసులో జైలు శిక్ష పడిన ఆమెకు, తాజాగా మరో కేసులో నాన్​ బెయిలబుల్​ వారెంట్ జారీ అయ్యింది. 2019 లోక్​సభ ఎన్నికల సమయంలో నియమావళి ఉల్లంఘించినందుకు ఆమెపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో భాగంగా ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచాలంటూ ప్రజాప్రతినిధుల కోర్టు రాంపుర్​ ఎస్​పీకి ఆదేశాలు జారీ చేసింది.

అసలేం జరిగిందంటే 

2019 లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున రాంపుర్​ నుంచి ఎంపీగా పోటీ చేసిన జయప్రదఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.​ విచారణలో భాగంగా అనేక సార్లు ప్రజాప్రతినిధుల కోర్టు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించకపోవడంతో కోర్టు ఆమెకు నాన్​ బెయిలబుల్​ వారెంట్​ జారీ చేసింది. ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా, పోలీసులు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 27కు వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news