జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-1 ఫలితాలు విడుదల

-

విద్యార్థులకు అలర్ట్.. జేఈఈ మెయిన్‌ 2024 సెషన్‌-1 ఫలితాలను జాతీయ పరీక్షల సంస్థ ఇవాళ ఉదయం విడుదల చేసింది. ఎన్‌టీఏ జేఈఈ అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులు తమ స్కోర్‌ కార్డును యాక్సెస్‌ చేసుకోవచ్చని తెలిపింది. అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి ఫలితాలు పొందొచ్చని చెప్పింది. గణితం, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రంలో పర్సంటైళ్లతో పాటు మొత్తం జేఈఈ మెయిన్‌ పర్సంటైల్‌ కూడా తెలుసుకునేందుకు.. ఈ లింక్ క్లిక్‌ చేయండి

జనవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్వహించిన సెషన్‌ 1 తుది కీని ఎన్‌టీఏ సోమవారం మధ్యాహ్నం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రాథమిక కీ, తుది కీ మధ్య మార్పులు చోటుచేసుకున్నాయి. మొత్తం 17 ప్రశ్నలకు కీ మారగా గణితంలో 3 ప్రశ్నలు (రెండు ప్రశ్నపత్రాలు), రసాయనశాస్త్రంలో 3 ప్రశ్నల (3 ప్రశ్నాపత్రాలు)ను తొలగించినట్లు అధికారులు తెలిపారు.

చివరి విడత (సెషన్‌ 2) ఏప్రిల్‌ 4 నుంచి 15 మధ్య నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. గతంలో ఒకేసారి రెండు విడతలకు దరఖాస్తు చేసిన వారు మళ్లీ ఇప్పుడు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మార్చి 2వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది..

Read more RELATED
Recommended to you

Latest news