BIGG BOSS-5 : ఆ కంటెస్టెంట్ కు సజ్జన్నార్ ఫుల్ సపోర్ట్…!

-

ప్ర‌స్తుతం బిగ్ బాస్ తెలుగు సీజ‌న్-5 కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. సీజ‌న్ 5 కి కాస్త క్రేజ్ త‌గ్గిన‌ట్టు క‌నిపిస్తున్నా ప‌లువురు సెల‌బ్రెటీలు ప్ర‌ముఖులు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల‌కు త‌మ స‌పోర్ట్ ను తెల‌ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రియాంక సింగ్ కు త‌న స‌పోర్ట్ ఉంటుంద‌ని మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు అప్ప‌ట్లో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా ఆర్టీసీ ఎండీ సజ్జాన్నార్ కూడా బిగ్ బాస్ లో ఓ కంటెస్టెంట్ కు స‌పోర్ట్ చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా సజ్జన్నార్ బిగ్ బాస్ హౌస్ లో సింగ‌ర్ శ్రీరామచంద్ర‌కు స‌పోర్ట్ చేస్తూ ట్వీట్ కూడా చేశారు.

cp sajjanar supports sriramachandra

శ్రీరామ చంద్ర అద్భుతంగా ఆడుతున్నాడ‌ని పాట‌లు కూడా చ‌క్కగా పాడుతున్నాడ‌ని స‌జ్జన్నార్ ప్ర‌శంసించారు. అలాగే ఆడుతూ శ్రీరామ‌చంద్ర బిగ్ బాస్ సీజ‌న్ -5 టైటిల్ గెల‌వాల‌ని స‌జ్జాన్నార్ ఆకాంక్షించారు. ఈ మేర‌కు ఓ వీడియోను విడుద‌ల చేశారు. ఇక స‌జ్జాన్నార్ ఆశీస్సులు పొంద‌డం ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని శ్రీరామచంద్ర టీం ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఇదిలా ఉండ‌గా శ్రీరామ‌చంద్ర‌కు బిగ్ బాస్ ద్వారా ఎంతో మంది అభిమానులు అయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version