కోవిడ్ బూస్టర్ డోసులు ఓ పెద్ద స్కాండల్ – WHO

-

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ తీవ్రత మళ్లీ పెరుగుతోంది. ప్రపంచంలో అన్ని దేశాలు కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని వేగవంతం చేశాయి. అయితే ప్రస్తుతం బూస్టర్ డోసులు వేసుకోవాల్సిందిగా కొన్ని దేశాలు కోరతున్నాయి. కాగా ఇలా ఆరోగ్యకరమైన పెద్దలకు బూస్టర్ డోస్ ఇవ్వడం అర్థంపర్థం లేని ఆలోచనగా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కొట్టి పారేశారు. కోవిడ్ బూస్టర్ డోసులు ఓ పెద్ద కుంభకోణంగా అభివర్ణించింది. ఆరోగ్యంగా ఉన్న పెద్దలకు బూస్టర్ డోసులు, చిన్న పిల్లకు టీకాలు వేయడం సమంజసం కాదని WHO అభిప్రాయపడింది. ప్రపంచంలో చాలా మందికి ఇంకా మొదటి డోసు కూడా అందలేదని ఆవేదన వ్యక్తం చేసింది.

పేద దేశాల్లో ఇప్పటికి కరోనా మొదటి డోసు వ్యాక్సిన్ కూడా అందలేదు. ఇప్పటికి వెనుకబడిన 100 దేశాల్లో 40 శాతం మందికి కరోనా మొదటి డోసు అందలేదంది WHO. ప్రపంచంతో ప్రతీ రోజు సాధారణం కన్నా ఆరు రెట్లు బూస్టర్ డోసులు వేస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఇది ఖచ్చితంగా ఓ స్కాండల్ అవుతుందని విమర్శించింది. కాగా ఇండియా బూస్టర్ డోస్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version