Pawan Kalyan: ‘ఆచార్య’ హంగామా షురూ.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్టులు పవన్ కల్యాణ్, కేటీఆర్!

-

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రేక్షకులకు చివరగా ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రంలో కనిపించారు. ఆ ఫిల్మ్ తర్వాత ఆయన నటించిన సినిమాలు విడుదల కాలేదు. కరోనా మహమ్మారి వలన పిక్చర్స్ రిలీజెస్ పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ నెల 29న చిరంజీవి నటించిన ‘ఆచార్య’ విడుదల కానుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశారు.

ఆచార్య ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న క్రమంలో మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ నెల 12న ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్ లో మేకర్స్ ప్రకటించారు. కాగా, ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. వాటి ప్రకారం.. ‘ఆచార్య’ఫిల్మ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలంగాణలోని హైదరాబాద్ యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరుగుతుందట.

ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా జనసేనాని పవన్ కల్యాణ్, తెలంగాణ మంత్రి కేటీఆర్ వస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ ఈవెంట్ కోసమై అనుమతులను తెలంగాణ రాష్ట్ర సర్కారు ఇచ్చినట్లు టాక్. అయితే, ఈ విషయమై మేకర్స్ నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రాలేదు.

చిరంజీవి , రామ్ చరణ్ లు ఈ చిత్రంలో నక్సల్స్ గా కనిపించనున్నారు. మెగాస్టార్ చిరుకు జోడీగా చందమామ కాజల్ అగర్వాల్ నటించగా, చెర్రీ సరసన హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటించింది. మెలోడీ బ్రహ్మ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో రెజీనా కసాండ్ర ‘చానా కష్టం వచ్చిందే మందాకిని’ అనే స్పెషల్ సాంగ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version