టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జా పేరు ఇప్పుడు తెలియని వారుండరు. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ మూవీ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందే అందరికీ తెలిసిందే. ఈ మూవీతో పాన్ ఇండియా హిట్ కొట్టేసిన తేజ సజ్జా తరువాత ప్రాజెక్ట్ కి రెడీ అయిపోయాడు. ఏ దర్శకుడితో సినిమా చేస్తాడా అని ఫ్యాన్స్ అనుకున్నారు. ప్రస్తుతం మిరాయ్ అనే భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో నటిస్తున్నాడు తేజ. గతంలో రవితేజతో ఈగల్ సినిమాను తీశాడు. కార్తీక్ ఘట్టమనేని.
మిరాయ్ మూవీ తాజాగా మరో క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. క్షుద్ర పూజల నేపథ్యంలో ఈ మూవీ వస్తోంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రోడక్షన్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాకు సంబంధించి తేజ సజ్జా మరో పోస్టర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోంది.