తెలుగులో డైరెక్ట్ సినిమా చేస్తున్న ద‌ళ‌ప‌తి.. రిస్క్ చేస్తున్నాడా!

ద‌ళ‌ప‌తి విజ‌య్ కు ఏ హీరోకు లేనంత క్రేజ్ సౌత్ ఇండియాలో ఉంద‌ని చెప్పాలి. నార్త్ ఇండియాలో కూడా ఈ హీరోకు అభిమానులు చాలా ఎక్కువే. క్రికెట్ స్టార్లు ఎక్కువ‌గా ఈ హీరో సినిమాల‌ను ఫాలో అవుతారంటే ఆయ‌న క్రేజ్ ఏంటో అర్థం అవుతోంది. ఇక టాలీవుడ్ లోనూ విజ‌య్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న తెలుగులో డైరెక్ట్ గా సినిమా చేయ‌లేదు. త‌మిళంలో చ‌సిన సినిమాల‌నే ఇక్క‌డ డ‌బ్ చేస్తూ వ‌చ్చారు.

కానీ ఇప్పుడు డైరెక్ట్ గా సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇందుకోసం ఓ క్రేజీ డైరెక్ట‌ర్ ను కూడా లైన్ లో పెట్టాడ‌ని తెలుస్తోంది. ఈ ఏడాదిలో మాస్ట‌ర్ సినిమాతో వ‌చ్చిన విజ‌య్‌.. ఎలాంటి ట్రెండ్ సెట్ చేశాడో చూశాం. లోకేశ్ క‌న‌గ‌రాజ్ డైరెక్ష‌న్ లో వ‌చ్చిన ఈ మూవీ సూప‌ర్ హిట్ అందుకుంది. ప్ర‌స్తుతం నెల్స‌న్ కుమార్ డైరెక్ష‌న్ లో సినిమా చేస్తున్నాడు.

కాగా ఈ మూవీ త‌ర్వాత టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లితో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడంట‌. ఇప్ప‌టికే వంశీ క‌థ‌ను విజ‌య్‌కు వినిపించ‌డంతో ఆయ‌న కూడా ఓకే చెప్పాడ‌ని స‌మ‌చారం. కాగా ఈ సినిమాపై త్వ‌ర‌లోనే అధికార ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని తెలుస్తోంది. ఇక ఈ మూవీని దిల్ రాజు నిర్మిస్తాడ‌ని తెలుస్తోంది. తెలుగులో మొద‌టి సారి డైరెక్ట్ గా సినిమా చేస్తున్న విజ‌య్ ఏ స్థాయి విజ‌యం అందుకుంటాడో చూడాలి.