సీటీ స్కాన్ తో కాన్సర్ ప్రమాదం…?

కోవిడ్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన సిటీ స్కాన్ అవసరం లేదు అని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా వెల్లడించారు. లక్షణాలు లేని వారికి సిటీ స్కాన్ అవసరం లేదు అని ఆయన స్పష్టం చేసారు. హోం ఐసోలేషన్ లో ఉండిలక్షణాలు లేని వారు కరోనా నుంచి కొలుకోవచ్చు అని సూచించారు. సిటీ స్కాన్ ఎక్కువగా చేసుకుంటే రేడియేషన్ వల్ల కాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అని హెచ్చరించారు.

చెస్ట్ ఎక్స్ రె తీసుకున్న తరువాత ఇబ్బందిగా ఉంటేనే సిటీ స్కాన్ చేసుకోవాలి అని సూచించారు. వైద్యుల సూచనమేరకు మాత్రమే రోగులు మందులు వాడాలి అని ఆయన సూచించారు. కోవిడ్ లక్షణాలు లేనివారు హోం ఐసోలేషన్ లో ఉండి జాగ్రత్తలు పాటిస్తూ కొలుకోవచ్చు అని తెలిపారు. మధ్యస్థ లక్షణాలు ఉన్నవారు అనవసరంగా మెడిసెన్లు టీసుకున్న చనిపోయే అవకాషన్ ఉంది అని పేర్కొన్నారు. కోవిడ్ ను ఎలా కట్టడి చేసుకోవచ్చు,ఔషధాల వినియోగం పై ఎప్పటికప్పుడు ప్రజలకి వేబినార్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం అని అన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు క్లినికల్ ఎక్సలెన్స్ కార్యక్రమాన్ని క్షేత్ర స్థాయికి తీసుకువెళ్తున్నాం అని వివరించారు.