చావుకు వీసా అక్కర్లేదంటూ.. సల్మాన్ ఖాన్​కు మళ్లీ బెదిరింపులు

-

బాలీవుడ్​ స్టార్ హీరో సల్మాన్​ ఖాన్​కు మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. చావుకు వీసా అక్కర్లేదంటూ దుండగులు సల్మాన్​కు బెదిరింపు లెటర్ రాశారు. అయితే ఈసారి ఫేస్​బుక్ మాధ్యమంగా ఈ వార్నింగ్ వచ్చింది. దీంతో ముంబయి పోలీసులు అప్రమత్తమయ్యారు. సల్మాన్​ను అప్రమత్తం చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు. భాయిజాన్​కు మళ్లీ బెదిరింపులు రావడంతో ఆయన కుటుంబంతో పాటు అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన క్షేమంగా ఉండాలని ప్రార్థనలు చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. గ్యాంగ్​స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరిట ఉన్న ఫేస్​బుక్ అకౌంట్​ నుంచి.. సల్మాన్ ఖాన్​కు డెత్ థ్రెట్ వచ్చింది. భాయిజాన్​తో పాటు ఈ పోస్టు​లో పంజాబీ సింగర్ జిప్పీ గ్రేవాల్​కు కూడా వార్నింగ్ ఉంది. జిప్పీని ఉద్దేశిస్తూ.. “నువ్వు సల్మాన్​ ఖాన్​ను సోదరుడిగా భావిస్తావు. ఇప్పుడు నీ అన్న వచ్చి నిన్ను కాపాడాల్సిన సమయం వచ్చింది. ఈ మెసేజ్​ నీకు మాత్రమే కాదు. సల్మాన్​ ఖాన్​కు కూడా. దావూద్ వచ్చి కాపాడతాడని ఊహల్లో ఉండకు. నిన్ను సేవ్ చేయడానికి ఎవరూ రారు. సిద్ధూ మూసేవాలా మరణంపై నువ్వు, ఎలా స్పందించావో మేము చూశాం. ఈ బెదిరింపు ట్రైలర్ లాంటిదే. అసలు సినిమా ముందుంది. నువ్వు ఏ దేశానికైనా వెళ్లు.. కానీ, మరణానికి వీసా అవసరం లేదు” అని పోస్టులో రాసి ఉంది. ఈ ఖాతాకు లారెన్స్ ఫొటోనే డీపీగా ఉందటంతో అది ఒరిజినల్ ఖాతానా లేక ఫేక్ అకౌంటా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news