కామిక్ కాన్ లో నేడే ‘ప్రాజెక్ట్ కె’ టైటిల్ గ్లింప్స్ రిలీజ్.. ఈవెంట్ కు దీపిక డుమ్మా

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దీవా దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ప్రాజెక్ట్ కె. మహానటి ఫేం నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ను ఈరోజు.. ప్రతిష్టాత్మక శాన్ డీగో కామిక్ కాన్ ఈవెంట్లో రిలీజ్ చేయనున్నారు.

ఈ  ఈవెంట్ కోసం ఇప్పటికే ప్రభాస్, రానా, కమల్ హాసన్ అక్కడికి చేరుకున్నారు. కానీ  దీపికా పదుకొణ మాత్రం.. ఈ ఈవెంట్కు హాజరు కావట్లేదు. అయితే దీని వెనక ఓ బలమైన కారణమే ఉందట.అదేంటంటే.. ?

ప్రస్తుతం హాలీవుడ్లో యాక్టర్స్ సమ్మె జరుగుతున్న విషయం తెలిసిందే.  ఈ సమ్మె.. స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్- అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ ఆధ్వర్యంలో జరుగుతోంది. ఈ ఫెడరేషన్లో దీపిక పదుకొణె కూడా ఓ సభ్యురాలే. ఇందులో సభ్యులెవరూ సినిమా షూటింగుల్లో కానీ, ఈవెంట్లలో కానీ పాల్గొనకూడదు. అందుకే దీపిక ఈ ఈవెంట్ కు హాజరు కావడం లేదని ఇంగ్లీష్ మీడియా చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news