స‌ర్‌ప్రైజ్ ఇస్తానంటున్న బిగ్‌బాస్ బ్యూటీ!

-

దేత్త‌డి హారిక‌.. తెలంగాణ యాస‌లో వెబ్ సిరీస్ చేస్తూ బాగా ఫేమ‌స్ అయింది. ఇక సోష‌ల్ మీడియాలో ఆమెకు ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. ఈ క్రేజ్ ఆధారంగా బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొంది. హౌస్ లో త‌న‌దైన టైమింగ్ తో అభిమానుల‌ను సంపాదించుకుంది. చాలా తక్కువ టైమ్లోనే మంచి ఆటతీరు కనబరుస్తూ ప్రేక్షకులు గుర్తించే స్థాయికి ఎదిగింద‌ని చెప్పాలి. యంగ్ హీరో అభిజీత్‌తో దేత్తడి పిల్ల చ‌నువుగా ఉంది. కానీ షో మొద‌ట్లో అతడు మోనాల్‌తో చనువుగా ఉండేవాడు. ఆ తర్వాత ఆమె దూరం కావ‌డంతో.. ఈ అవ‌కాశాన్ని హారిక బాగా ఉప‌యోగించుకుంది. అభిజీత్‌కు హారిక బాగా క్లోజ్ గా మూవ్ అయింది. అప్పటి నుంచి ట్రాక్ నడుపుతూ ‘అభిక’గా ట్రెండ్ అయింది.

తెలంగాణ రాష్ట్ర ప‌ర్యాట‌క అభివృద్ధి సంస్థకు హారిక‌ను బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించారు. అయితే ఏమైందో ఏమో గానీ ఈ విష‌యంపై తీవ్ర విమర్శలు రావ‌డంతో హారిక వివాదాస్పదంగా మారింది. దీంతో ఆమె స్వయంగా ఆ పదవి నుంచి తప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

ఇక బిగ్ బాస్ నుంచి బ‌య‌ట‌కొచ్చాక‌ వరుస ఆఫర్లతో బిజీ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో హారిక ఏకంగా ఓ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ పట్టేసిందని తెలిసింది. అలాగే మరో మూవీకి కూడా కూడా సంతకం చేసింద‌ని టాక్‌. కాగా ఆ స్టార్ హీరో ఎవరో బ‌య‌ట‌పెట్ట‌ట్లేదు. అంతా స‌ర్‌ప్రైజ్ అంటూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. ఇవే కాకుండా మ‌రో రెండు వెబ్ సిరీస్ లో కూడాన‌టిస్తోంది హారిక‌. ఇందులో ఒకటి క్రైమ్ నేప‌థ్యం కాగా… మరొకటి కామెడీ జోనర్ లో రానున్న‌ట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news