‘దేవర’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ టైం ఫిక్స్..!

-

టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్‌, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న యాక్షన్‌ డ్రామా ‘దేవర’. జ‌న‌తా గ్యారేజ్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక సినిమాకు సంబంధించి తారక్ పోస్టర్ నుంచి ప్రతి అప్డేట్ తో చిత్రబృందం ఈ మూవీపై హైప్ క్రియేట్ చేసింది.  రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ క‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంను ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 10వ తేదీన విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది.

ఇప్ప‌టికే మూవీ నుంచి విడుదలైన ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆక‌ట్టుకున్నాయి. అయితే మే 20వ తేదీన తార‌క్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మూవీ నుంచి ఫ‌స్ట్ సింగిల్ లాంఛ్ చేయ‌నున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి మరో అప్‌డేట్‌ను ఇచ్చింది. దేవ‌ర ఫ‌స్ట్ సింగిల్‌ను మే 19వ తేదీ సాయంత్రం 7.02 గంట‌ల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

https://x.com/UrsVamsiShekar/status/1791707613316763915?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1791707613316763915%7Ctwgr%5E8f3dbb6373da7be9261783333329eb72a22dbf42%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ntnews.com%2Fcinema%2Fdevara-fear-song-coming-on-may-19th-1589696

Read more RELATED
Recommended to you

Latest news