జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ గా చేసిన దేవర సినిమా కలెక్షన్ లలో దుమ్ములేపుతోంది. ముచ్చటగా మూడు రోజుల్లో 304 కోట్లు వసూలు చేసింది దేవర సినిమా. మేరకు మేకర్స్ అధికారికంగా ప్రకటన చేశారు. శని అలాగే ఆదివారం వరుసగా రావడంతో…300 కోట్లు దాటింది దేవర కలెక్షన్స్.
మరో వారంలో 500 కోట్ల మార్కులు కూడా… దేవర అందుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. దేవర సినిమా.. మొన్న 27వ తేదీ..ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. దేవర సినిమాలో జూనియర్ ఎన్టీఆర్.. హీరోగా చేయగా… జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవర కు కళ్యాణ్ రాం నిర్మతగా వ్యవహరించారు. ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ నిర్మాణం వహించిన విషయం తెలిసిందే.