బైక్, కారు డ్రైవింగ్ వచ్చి వాటిని కొనేసుకుని వాడేస్తే సరిపోదు. ముఖ్యంగా కారు ఉన్నవాళ్లు చాలా విషయాలు తెలుసుకోవాలి. కారు ప్రమాదం జరిగినప్పుడు మీ తప్పు లేకపోయినా దాన్ని నిరూపించడానికి మీ దగ్గర ఆధారాలు ఉండాలి. లేకపోతే, అవతలి వారు మీదే తప్పని బుకాయించగలరు. చట్టం ముందు కూడా మీరు దోషిగా నిలబడే ప్రమాదం ఉంది. ప్రతి చోట సీసీ కెమారాలు ఉండవు. జైలు, ఫైన్ ఇలా ఎన్నో సమస్యలు. అందువల్ల మీ కారులో డ్యాష్‌కామ్ ఉండాలి. దాన్ని ప్రయోజనాలు ఏంటో తెలిస్తే మీరు వెంటనే ఫిక్స్ చేసుకుంటారు.
కారులో డ్యాష్‌కామ్ అనేది విదేశాల్లో ఎక్కువగా వాడతారు. మన దేశంలో ఇప్పుడిప్పుడే దాన్ని సెట్ చేసుకుంటున్నారు. దీన్నే డ్యాష్‌బోర్డ్ కెమెరా అని కూడా అంటారు. ప్రపంచవ్యాప్తంగా అనేక రోడ్డు ప్రమాదాల్లో, నేరాల నిరూపణలో డ్యాష్‌కామ్ ఫుటేజ్ కీలక ఆధారంగా ఉపయోగపడుతోంది. దీనితో చాలా ఉపయోగాలున్నాయి.
రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మీ తప్పు లేదు అని మీరు డ్యాష్‌కామ్ ఫుటేజ్ ద్వారా నిరూపిస్తే.. మీరు కొన్ని లక్షల రూపాయల ఫైన్, జైలు శిక్ష నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. అంతేకాదు.. ప్రమాద సమయంలో కారు వేగం, దూరం, ప్రదేశం అన్నింటికీ ఆ ఫుటేజే సాక్షం.
ఈ రోజుల్లో ఫ్రాడ్ డ్యామేజ్ క్లెయిమ్‌లు చాలా కామన్ అయిపోయాయి. కొంతమంది రోడ్డు ప్రమాదంలో మీకు ఏమాత్రం సంబంధం లేకపోయినా.. మీరే డ్యామేజ్ చేశారని క్లెయిమ్ లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం తప్పుగా డిమాండ్ చేస్తే, అటువంటి పరిస్థితిలో డాష్‌క్యామ్ వీడియో రికార్డింగ్ సాక్ష్యంగా పనిచేస్తుంది.
కారులో డాష్‌క్యామ్ ఉంటే.. దొంగల ఆటలు సాగవు. కారు ఉన్న పార్కింగ్ ప్రదేశంలో జరిగే సంఘటనలను కూడా రికార్డ్ చేస్తుంది. మీరు పార్కింగ్ స్థలంలో కూడా డాష్‌క్యామ్‌ను ఆన్‌లో ఉంచితే, సంఘటనలు అందులో రికార్డ్ అవుతూనే ఉంటాయి. దీనివల్ల నేరగాళ్లను పట్టుకోవడం తేలిక అవుతుంది.
మీరు మోసపూరిత క్లెయిమ్‌లను నివారించి మంచి ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంటే, బీమా కంపెనీ మీకు నో క్లెయిమ్ బోనస్‌ను కూడా ఇస్తుంది. బీమాను క్లెయిమ్ చేయనందుకు, నెక్ట్స్ ప్రీమియంలో మీకు తగ్గింపు ఉంటుంది.
మీ కారులో డాష్‌క్యామ్‌ని ఇన్‌స్టాల్ చేస్తే..రోడ్ ట్రిప్‌లను రికార్డ్ చేయడానికి ప్రత్యేక కెమెరాను కొనాల్నిన అవసరం లేదు. కారు ముందు భాగంలో అమర్చితే మీరు పూర్తి రోడ్ ట్రిప్‌ను ఇందులో రికార్డ్ చేసుకోవచ్చు.
ఇలా డాష్ క్యామ్ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి.. ఒకసారి ఆలోచించండి..!