వర్మ నీ తాట తీస్తా.. అంతు చూస్తా.. నీ బయోపిక్ టైటిల్ ‘ఎర్రగడ్డకు దారేది’

-

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ బయోపిక్ తీస్తానని అంటున్నాడు చంద్రబాబు వీరాభిమాని దేవి బాబు చౌదరి. వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ పై కేసు పెట్టింది కూడా ఈయనే. చంద్రబాబు వీర భక్తుడైన దేవి బాబు ఇప్పుడు ఏకంగా వర్మ మీద బయోపిక్ తీసేందుకు సిద్ధం అంటున్నాడు. ఆ సినిమాకు టైటిల్ గా ఎర్రగడ్డకు దారేది అని పెడతా అంటున్నాడు.

ఇంటర్నేషనల్ పిచ్చి సంఘానికి కేఏ పాల్ అధ్యక్షుడు అయితే.. అఖిల భారత పిచ్చ సంఘానికి అధ్యక్షుడు రామ్ గోపాల్ వర్మ అని అన్నారు. చంద్రబాబు నాయుడిని ఎవ్రు కించపరచినా తాను ఊరుకునేది లేదని.. ఒరేయ్ వర్మా నీ తాట తీస్తా.. అంతు చూస్తా అంటూ వీరంగ ఆడేస్తున్నాడు దేవి బాబు. ఊరకుక్క అరిస్తే ఎలా ఉంటుందో రాం గోపాల్ వర్మ మాట్లాడితే కూడ అలానే ఉంటుందని అంటూ ఫైర్ అయ్యాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా జగన్ కోసం తీసిందని.. రామ్ గోపాల్ వర్మకు పిచ్చిలేచి రకరకాల బయోపిక్‌లు తీస్తున్నారని ఎద్దేవా చేశారు దేవి బాబు. మరి వీటికి కౌంటర్ గా వర్మ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version