హీరో ధ‌నుష్ పిల్ల‌ల‌ను చూశారా..!

-

హీరో ధ‌నుష్ అస‌లు పేరు వెంకటేశ్‌ ప్రభు కస్తూరి రాజా. అయితే.. సినిమాల్లో మాత్రం ఆయ‌న పేరు ధ‌నుష్‌గా నిలిచిపోయింది. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె అయిన ఐశ్వర్యను నవంబరు 18, 2004లో ధనుష్ పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు, 2006లో యాత్ర, 2010లో లింగా జన్మించారు. ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా షూటింగ్స్ లేక‌పోవ‌డంతో ధ‌నుష్ త‌న పిల్ల‌ల‌తో క‌లిసి ఆనందంగా గడుపుతున్నాడు. తాజాగా ధ‌నుష్ త‌న పిల్ల‌ల‌తో క‌లిసి ఉన్న ఫోటో ఒక‌టి బ‌య‌ట‌కి వ‌చ్చింది. ఆ ఫోటో చూసి అభిమానులు ఆనంద‌ప‌డుతున్నారు.

ఇక నటుడు, నేపథ్య గాయకుడు, రచయితగా ధ‌నుష్ మంచి గుర్తింపు పొందాడు. 2011 లో ధ‌నుష్‌ నటించిన ఆడుకలామ్ చలనచిత్రంలో ఆయ‌న నటనకు గాను భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఉత్తమ నటుడుగా ఎంపికయ్యాడు, అదే సంవత్సరంలో అతడు పాడిన వై దిస్ కొలవెరి డి పాట ఎంత సంచ‌ల‌నం సృష్టించిందో అంద‌రికీ తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news