కరోనా మహమ్మారికి విరుగుడు కనిపెట్టే పనిలో ముందంజలో ఉన్న రష్యా ప్రపంచానికి మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే రష్యా స్పుత్నిక్ వ్యాక్సిన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే.. వెక్టర్ స్టేట్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ వైరాలజీ అండ్ బయో టెక్నాలజీ తయారు చేసిన ఎపివాక్ వ్యాక్సిన్ మనుషులపై చేసిన ప్రయోగాల్లో సురక్షితంగానే ఉన్నట్లు ఓ నివేదికలో పేర్కొంది. వచ్చే సెప్టెంబర్ నాటికి క్లినిక్ ట్రయల్స్ పూర్తవుతాయని ఫెడరల్ సర్వీస్ ఫర్ సర్వైవలెన్స్ ఆన్ కన్జ్యూమర్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ హ్యూమన్ వెల్ బీయింగ్ సంస్థ ప్రకటించింది.
వ్యాక్సిన్ మొదటి షాట్ 57 మందికి ఇవ్వగా ఎలాంటి దుష్ప్రభావాలు కలిగించలేదని ఆ సంస్థ చెప్పింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దేశం మొదటి వ్యాక్సిన్ స్పుత్నిక్ వీని ఇటీవల విడుదల చేయగా పలు విమర్శలు వెల్లువెత్తాయి. వ్యాక్సిన్‌ను సరిగ్గా పరిశీలించలేదని పలు ఆదేశాలు ఆరోపించాయి. అలాగే.. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ గురించి తమకు సమాచారం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే.