ప్రభాస్ సలార్ మూవీ నుంచి డైలాగ్ లీక్..!

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ మరియు భారీ విఎఫ్ఎక్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని.. పోస్టు ప్రొడక్షన్ పనులు మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని సమాచారం.

ఈ సినిమా షూటింగ్ లో కొంత భాగాన్ని తెలంగాణలోని గోదావరిఖని బొగ్గు గనుల్లో చిత్రీకరించారు. అంతేకాకుండా హైదరాబాద్ నగర శివారులో ప్రత్యేకమైన సెట్స్ లో సినిమా చిత్రీకరణను జరిపారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. ఇవాళ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ సలార్ మూవీ నుంచి ఓ డైలాగ్ లీక్ చేశారు. ప్రభాస్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. యుద్దానికీ నువ్వు నీ ఆర్మీని తీసుకొచ్చావు.. నేను అతడిని తీసుకొచ్చా.. వర్థరాజమన్నార్ అని ట్వీట్ చేశారు. సలార్ లో సుకుమారన్ వర్ధరాజమన్నార్ పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఆయన డైలాగ్ ను రివీల్ చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news