సర్కారు వారి పాట తరువాత
రాజమౌళి సినిమా..
హా అవును భారీ బడ్జెట్ సినిమా
ఈ సినిమాకు నమ్రత ప్రొడక్షన్ వర్క్స్ చూస్తున్నారు
పేరుకే దుర్గా ఆర్ట్స్ కానీ ఎలానూ ఫైనాన్షియర్లే ఈ సినిమా రూపకల్పనకు దిక్కు కానున్నారు. ట్రిపుల్ ఆర్ మాదిరిగా కాకుండా
టెన్షన్ లేని విధంగా ఫిల్మ్ చేయాలని అనుకుంటున్నారు. ఎప్పటిలానే బాగా తెలిసిన కథతోనే మ్యాజిక్ చేయాలని యోచిస్తున్నారు దర్శక ధీర. ఈ సారి కీరవాణిని కొనసాగిస్తారో లేదో అన్న డౌట్ కూడా ఉంది. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ పాటలు
అస్సలు కుదరలేదు కనుక ! అలానే ఎడిటర్ కూడా ట్రిపుల్ ఆర్ కి మారిపోయారు. తన గురువు కోటగిరి వేంకటేశ్వరరావును కాకుండా శ్రీకర్ ప్రసాద్ ను తీసుకున్నారు. ఈ సారి సౌండ్ అబ్జర్వర్ కూడా మారిపోయారు. ప్రతిసారీ పనిచేసే కల్యాణీ మాలిక్ ను తప్పించి , ట్రిపుల్ ఆర్ విషయమైకాల భైరవను తీసుకున్నారు.
అదేవిధంగా మహేశ్ బాబు సినిమాకు కూడా చాలా మంది మారితే మారవచ్చు. ఏమో చెప్పలేం. సెంథిల్ ను ఉంచుతారా ఉంచరా ? ఎందుకంటే మహేశ్ సినిమాను హాలీవుడ్ రేంజ్ కు తీసుకుని పోవాలని అనుకుంటున్నారు. అందుకనో ఎందుకనో ఆయనను కొనసాగించడం అన్నది జరుగుతుందో జరగదో అన్నది చెప్పలేం. గతంలో తన దగ్గర ఎంతో నమ్మకంగా పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ను తప్పించి, సాబు శిరిల్ ను బాహుబలి సమయంలో తెచ్చారు. అదే రీతిలో ఈ సినిమా విషయమై కూడా రాజమౌళి నిర్ణయాలు మారవచ్చు.
ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్ సినిమా రెండు రోజుల్లో నాలుగు వందల ముప్పై కోట్లు లాగేసింది. ఇంకా చెప్పాలంటే మరో రెండు రోజులు ఓపిక పడితే పెట్టిన పెట్టుబడి అంతా వెనక్కు వచ్చేస్తుంది. మరో రెండు రోజులు ఆగితే లాభాల వేట మొదలయి తుది అంకం కు చేరే వరకూ కొనసాగుతుంది. ఇదీ ట్రిపుల్ ఆర్ రిజల్ట్. అందుకనో ఎందుకనో రాజమౌళి కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఆయన అనుకున్న విధంగా సినిమా కలెక్షన్లు ఉన్నాయి కనుక మరో సినిమా కు కూడా ఇంతే స్థాయిలో రిస్క్ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కథ కాన్సెప్టు గెటప్పూ సెటప్పూ అన్నీ రెడీ అయ్యాయని తెలుస్తోంది.
మహేశ్ బాబుతో దుర్గా ఆర్ట్స్ నిర్మించబోయే సినిమాపై ఇప్పటి నుంచి గాసిప్పులు గారడీలు వెలుగు చూస్తున్నాయి. సీనియర్ ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణ ఎప్పటి నుంచో ఈ సినిమా నిర్మించనున్నారు. రాజమౌళి కూడా వ్యాపార భాగస్వామిగా ఉంటారు. ఆయనతో పాటు మహేశ్ బాబు కూడా నిర్మాణ రంగంలో భాగం అందుకుంటారు.
జీఎంబీ ఎంటర్టైన్మెంట్ పేరిట సొంత బ్యానర్ ఎలానూ ఉంది కనుక ఈ సినిమా త్వరలోనే అతి వేగంగా పట్టాలెక్కనుంది. మరి! సినిమా ఖర్చు ఎంతో తెలుసా ఎనిమిది వందల కోట్లు. ఈ స్థాయిలో ఖర్చు పెట్టాక వెనక్కు సొమ్ములు తెచ్చుకోవడం కూడా తనకు తెలుసు అని రాజమౌళి అంటున్నారని సమాచారం. మరి ! మహేశ్ బాబు ఈ సినిమా కోసం ఎన్ని రోజులు కేటాయిస్తారో అన్నది అత్యంత ఆసక్తిదాయకం.తొలిసారి ఆయనను డైరెక్ట్ చేస్తున్న రాజమౌళి కి ఇది ఓ విధంగా ప్రత్యేకమయిన సినిమా.. ప్రత్యేక మయిన కథాంశం కూడా ! టక్కరి దొంగ తరువాత కొన్ని సాహస నేపథ్యం ఉన్న పాత్రలు వేయాలనుకున్న కలకు కొనసాగింపు ఈ సినిమా..! ఆ సినిమాలో కౌబోయ్ గా
కనిపించినా ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయారు. కానీ ఇప్పుడు జేమ్స్ బాండ్ క్యారెక్టర్లో ప్రేక్షకులను ఆయన అలరించనున్నారు అని టాక్.
– డైలాగ్ ఆఫ్ ద డే – మన లోకం ప్రత్యేకం