ఒక్క తెలుగు సినిమా ఆమె కెరియర్ ను నాశనం చేసిందా..?

-

సినీ ఇండస్ట్రీ అన్న తర్వాత ఒడిదుడుకులు తప్పవు.. అయితే కొంతమందికి మొదటి సినిమాతోనే స్టార్ ఇమేజ్ లభిస్తే మరికొంతమంది మొదటి సినిమాతోనే కనుమరుగవుతూ ఉంటారు . అలాంటి వారిలోకి చేరిపోయింది బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన చిత్రం లైగర్.. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది నార్త్ బ్యూటీ అనన్య పాండే. ఈమె గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కానీ లైగర్ సినిమాతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈమె అందాలు చూసి కుర్ర కారు సైతం కథలుగా చెబుతున్నారు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ల కలయికలో హీరోయిన్గా చేసే సువర్ణ అవకాశాన్ని పొందింది. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలైన నాటి నుండి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమా విడుదలైన తర్వాత డిజాస్టర్ గా మిగిలింది. మొదటి షో నుండే నెగటివ్ టాక్ సొంతం చేసుకుని అందరి జీవితాలను తలకిందులు చేసింది. ఈ సినిమా పూరీ జగన్నాథ్ మరియు ఛార్మీ లు కూడా ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకోవడం జరిగింది. మొత్తానికైతే భారీ నష్టాలను చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని చెప్పవచ్చు. అంతేకాదు ఇప్పటికీ ఈ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కూడా పూరీ జగన్నాథ్ ను డబ్బు కోసం వెంటాడుతూనే ఉన్నారు.

ఈ సినిమా డిజాస్టర్ అవ్వడానికి హీరోయిన్ కూడా ప్రధాన కారణం అని టాక్ రావడంతో అనన్యకు పెద్ద షాక్ తగిలింది. తనకు అందం తప్ప నటనలో ఏమాత్రం ప్రావీణ్యం లేదని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు తన చేతిలో డ్రీమ్ గర్ల్ 2 అనే ఒక్క సినిమా మాత్రమే ఉండడం గమనార్హం. ఈ సినిమా హిట్ అయితేనే తన కెరియర్ ఉంటుంది. లేదంటే ఇక ఈమె కెరియర్ ముగిసినట్లే అంటూ సినిమా వర్గాలు నుంచీ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version