టాలీవుడ్ లో తమకంటూ ఏదైనా ఒక పాత్ర వస్తే సరైన సమయంలో సరైన కథతో.. పాత్ర వచ్చినప్పుడు అద్భుతాలు సృష్టించగల నటులలో కచ్చితంగా బెనర్జీ ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో ఈయన విరాటపర్వం సినిమాలో కీలకపాత్రలో నటించి సినిమాకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. సినిమా ఎంత పెద్దదైనా.. పాత్ర మాత్రం కచ్చితంగా బెనర్జీకి ఉంటుంది. కానీ ఆయనకు రావాల్సిన పేరు మాత్రం ఇప్పటికీ రాలేదనే చెప్పాలి. ఎంతోమంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నా కూడా మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఆయన నిజంగానే ఒక గొప్ప నటుడు.. ఆయనకు ఆ నట వారసత్వం వచ్చిందంతా ఆయన తండ్రి నుంచే..
ఈయన తండ్రి ఎవరో కాదు నటుడు రాఘవయ్య.. తన తండ్రి ఇచ్చిన నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆయన ఎదిగిన వైనం మనందరం చూసాము. చాలామంది నటన అంటే ఎక్స్ప్రెషన్స్ తో పాటు గట్టిగా అరిచి డైలాగులు చెప్పి.. అందరి అటెన్షన్ సంపాదించడం అని అందరూ అనుకుంటారు. కానీ వీరందరికీ బెనర్జీ పూర్తిగా విరుద్ధమని చెప్పాలి. ఆయన డైలాగ్ చెప్పే విధానంలో ఒక ఫోర్స్ ఉంటుంది.. ఎక్కడ కూడా పక్కన అటు నుండి డామినేట్ చేసినట్లు కనిపించదు. చాలా సౌమ్యంగానే తన డైలాగులు చెబుతూ తన పాత్రలో లీనం అయిపోయి.. తన పాత్రకు ప్రాణం పోస్తూ ఉంటారు.
ఎలాంటి పాత్ర ఇచ్చిన కూడా ఎంతో సమర్థవంతంగా పోషించగలడు. ఒకవైపు క్రూరమైన విలన్ గాను మరొకవైపు హీరో హీరోయిన్స్ కి తండ్రిగా కూడా నటించగలరు . అందుకే ఈయనను లెజెండ్రీ యాక్టర్ అని కూడా అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. బెనర్జీ చిన్నతనంలో తండ్రి రాఘవయ్య ఇన్ఫర్మేషన్ మరియు బ్రాండ్ కాస్టింగ్ మంత్రిత్వ శాఖలో పనిచేయడం వల్ల ఢిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత చెన్నైకి వచ్చి హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేశారు. బెనర్జీ మొదట్లో విజయనగరంలో ఒక కంపెనీకి బ్రాంచ్ మేనేజర్ గా పనిచేశాడు. ఆ తర్వాత ఇండస్ట్రీ లోకి వచ్చిన ఈయనకి వివాహం చేసుకున్న తర్వాత ఒక కూతురు జన్మించింది.