ప్రజెంట్ ట్రెండ్ అంతా ఓటీటీలదే నడుస్తోంది. ఇప్పటికే పలు ఓటీటీలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీ ట్రెండ్‌ను చూసి టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అర్వింద్ ఆహా అనే ఓటీటీని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు అదే బాటలో మరో తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఓటీటీ రంగంలో అడుగు పెడుతున్నారంటూ రెండ్రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతోంది. ఈ వేదికగా చిన్న సినిమాలను ప్రోత్సహించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను తీసుకురానున్నట్లు రూమర్స్ వచ్చాయి.
ఈ వార్తలపై దిల్ రాజు నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ స్పందించింది. నిర్ధారణ కాకుండా ఇలాంటి వార్తలను ప్రచురించవద్దని కోరుతూ ఆ రూమర్స్‌ను ఖండించింది. దిల్‌రాజు ఓటీటీ ఫ్లాట్‌ఫాంను తీసుకొస్తున్నారనే వార్తలు పూర్తిగా నిరాధారమైనవని స్పష్టం చేసింది.
రూ.5కోట్లలోగా బడ్జెట్‌తో దాదాపు 25 చిన్న సినిమాలను నిర్మించి వాటిని ఓటీటీ వేదికగా విడుదల చేయాలని యోచిస్తున్నట్టు నెట్టింట వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇది 2024లో అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఆయన నిర్మించే సినిమాలతో పాటు.. డిస్ట్రిబ్యూట్ చేసే చిత్రాలు కూడా అందులోనే విడుదలయ్యే అవకాశముందని రూమర్స్ వచ్చాయి.