ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అజయ్ భూపతి తన నెక్ట్స్ సినిమా కోసం ఓ కథ రెడీ చేసుకున్నాడు. ఈ కథకు మహాసముద్రం అనే టైటిల్ కూడా పెట్టుకున్నాడు. ఈ సినిమా కథ విషయంలో ఓ హీరోతో గ్యాప్ రావడంతోనే అజయ్ ఆ హీరో టార్గెట్‌గా ఈ ట్వీట్ చేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కేవలం చీప్ స్టార్ అంటూ ఓ పదం మాత్రం ట్వీట్ చేశారు. అంతకు మించి ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. దీంతో ఆ హీరో ఎవరన్నదానిపై ఇండస్ట్రీలో గుసగుసలు నడుస్తున్నాయి. మహాసముద్రం కథను ముందుగా నాగచైతన్యతో చేద్దామని ప్లాన్ చేసినప్పటికీ వర్కవుట్ కాలేదు. రెండో ప్రయత్నంలో భాగంగా రవితేజను అప్రోచ్ అయ్యారు. ఓకే అన్నట్టుగా వార్తలు వచ్చాయి.
రీజన్ ఏంటో తెలియదు గాని రవితేజ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టాడట. ఆ కోపంతోనే అజయ్ రవితేజను టార్గెట్‌గా చేసుకుని చీప్‌స్టార్ అన్నట్టుగా టాక్. గతేడాది మూడు వరుస ప్లాపులు వచ్చినా కూడా రవితేజ తన రేటు విషయంలో కొండెక్కి కూర్చున్నాడట. అజయ్ ఓ నిర్మాతను అప్రోచ్ అయినా రవితేజ రేటుతో నీతో సినిమా చేయను పొమ్మన్నాడట.
ఈ విషయంలోనే అజయ్‌కు, రవితేజకు గ్యాప్ వచ్చిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడీ వివాదం చినికిచినికి గాలివానగా మారడంతో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రంగప్రవేశం చేసినట్టు తెలుస్తోంది. వీరిద్దరికి వర్మ గురువు కావడంతోనే వర్మ సర్దుబాటు చేస్తున్నట్టు తెలుస్తోంది.
‘Cheap Star’
— Ajay Bhupathi (@DirAjayBhupathi) September 2, 2019