అందరి ముందు హీరోయిన్​కు ముద్దు పెట్టిన డైెరెక్టర్.. వీడియో వైరల్.. నెటిజన్స్ ట్రోలింగ్

-

కొంతమంది దర్శకులు, నిర్మాతలు, హీరోలు, ఇతర ప్రముఖులు అప్పుడప్పుడు నోరే కాదు చేతులు.. ఒళ్లూ జారుతుంటారు. తాజాగా ఓ దర్శకుడు కూడా అలాగే చేశాడు. ఒక్కసారిగా అందరి ముందు హీరోయిన్​కు ముద్దు పెట్టాడు. దీంతో ఆమెకు ఏం చేయాలో అర్థంగాక తలదించుకుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి.. తాజాగా రాజ్ తరుణ్​తో తిరగబడరా సామీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మన్నరా చోప్రా హీరోయిన్​గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్​లో మీడియాతో చిత్రబృందం ముచ్చట్లు పెట్టింది. ఈ క్రమంలో ఒక్కసారిగా రవికుమార్.. మన్నరా బుగ్గలపై ముద్దు పెట్టాడు. ఆ సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక మన్నారా చోప్రా నవ్వుతూ కవర్ చేసినట్టుగా అనిపించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నారు. ఇక దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news