ఈ సారి మళ్లీ రియల్ ఇన్సిడెన్స్ తో ప్లాన్ చేస్తున్న గోపిచంద్ మలినేని.!

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా తాజాగా జనవరి 12న విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఎక్కడా చూసినా బాలయ్య సినిమా గురించే చర్చ నడిచింది. మొదటి రోజు నుండే వసూళ్ళు కూడా అనుకున్నట్టే అదరగొట్టాయి.

మరో వైపు ఈ సినిమా లోని డైలాగ్స్ పై ప్రభుత్వం కూడా ఒక కన్ను వేసింది. ఇది కలకలం రేపింది. ఇక ఈ సినిమా వసూళ్ళు చూసుకుంటే కొద్దిగా చిరంజీవి సినిమా ఉండటం వల్ల కొంచం తగ్గిపోయాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే 100 కోట్లు వసూళ్లు సాధించి బ్రేక్ ఈవెన్ ను కూడా అందుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత మూవీ కూడా మైత్రీ మూవీస్ వారికే చేస్తున్నట్లు డైరెక్టర్ గోపిచంద్ ప్రకటించాడు. ఇక బాలయ్య బాబు మూవీ వీర సింహ రెడ్డి కూడా ఫ్యాన్స్ కోరుకునే సీన్స్ తోనే రిస్క్ లేకుండా తీశాడు. కాని తనకి క్రాక్ సినిమా  గుర్తింపు తెచ్చి నట్లుగా ఈ సినిమా పేరు తేలేదు.ఇక గోపి చంద్ మలినేని దర్శకత్వంలో వచ్చే నెక్స్ట్ సినిమా మళ్లీ రియల్ ఇన్సిడెన్స్ తో తీయాలని ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. దాని కోసం తన రైటింగ్ డిపార్ట్ మెంట్ తో కూర్చుని చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.