నేను డ్రగ్స్ తీసుకోలేదు.. కావాలనే నన్ను ఇరికించారు : క్రిష్

-

టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుంది. రాడిసన్‌ హోటల్‌ డ్రగ్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ కేసులో మరో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దాంతో డ్రగ్స్‌ కేసుల నిందితుల సంఖ్య 14కు చేరింది. పరారీలో ఉన్న శ్వేత, లిషి,నీల్‌ విదేశాలకు పారిపోయినట్టు పోలీసుల అనుమానిస్తున్నారు. డ్రగ్స్‌ సప్లై పై ఆరా తీస్తున్న పోలీసులు గుట్టు విప్పేందుకు ప్రత్యేక టీమ్‌లను రంగంలోకి దించారు. ఇక ఈ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ దర్శకుడు క్రిష్ పేరు బయటకు వచ్చిన విషయం తెలిసిందే.

క్రిష్ పేరు బయటకు రావడంతో హైకోర్టును ఆశ్రయించాడు డైరెక్టర్‌ క్రిష్‌. డ్రగ్స్ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ పిటిషన్‌ దాఖలు చేశారు క్రిష్‌. క్రిష్‌ను ఇవాళ విచారణకు పిలిచారు గచ్చిబౌలి పోలీసులు. కానీ ఆయన హైకోర్టును ఆశ్రయించాడు. హైకోర్టులో క్రిష్‌ ముందస్తు బెయిల్‌పై విచారణ జరిగింది. డ్రగ్స్‌ పార్టీతో తనకు సంబంధం లేదని తెలిపారు దర్శకుడు క్రిష్. వివేకానంద ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో..తనను నిందితుడిగా చేర్చారని క్రిష్‌ పేర్కొన్నాడు. నేను డ్రగ్స్ తీసుకున్నాననడానికి ఆధారాలు లేవు. కావాలనే కేసులో ఇరికించారని తెలిపారు క్రిష్‌. అయితే డ్రగ్స్ కేసు వివరాలు సమర్పించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది న్యాయస్థానం.

Read more RELATED
Recommended to you

Exit mobile version