డంకీ డైరెక్టర్ తో రామ్ చరణ్ మూవీ.. ఇదిగో క్లారిటీ

-

రాజ్ కుమార్ హిరానీ.. త్రీ ఇడియట్స్, పీకే వంటి సినిమాలతో ఉత్తరాదితో పాటు దక్షిణాదినా పేరు పొందిన డైరెక్టర్. ఆయనతో సినిమా అంటే స్టార్ హీరోలు కూడా ఎగిరి గంతేస్తారు. ఇటీవలే బాలీవుడ్ బాద్షాకు హిరాణీతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. షారుక్-హిరానీ కాంబోలో తాజాగా డంకీ సినిమా రిలీజ్ అయింది. అయితే త్వరలోనే ఆయన మెగాపవర్ స్టార్ రామ్చరణ్తో సినిమా తీయబోతున్నట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుని గ్లోబల్ స్టార్గా మారిన రామ్ చరణ్కు బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు వస్తున్న విషయం తెలిసిందే. ధూమ్ 4 మూవీలో సూపర్ కాప్గా చెర్రీ నటించనున్నట్లు కొన్ని రోజుల నుంచి నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పుడు ఏకంగా ‘డంకీ’ డైరెక్టర్ రాజ్కుమార్ హిరాణీతో ఓ ప్రాజెక్టు ఓకే అయినట్టు మరో వార్త చక్కర్లు కొడుతోంది. దీనిపై తాజాగా రాజ్కుమార్ హిరానీ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతానికైతే తాను రామ్ చరణ్తో ఎలాంటి సినిమా ప్లాన్ చేయడం లేదని చెప్పారు. కానీ నాకు రామ్ చరణ్ బాగా తెలుసని ఒక వేళ ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news