రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం న్యూ ఇయర్ శుభాకాంక్షలు

-

తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్‌రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు అందరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. మరోవైపు అందరి సహకారంతో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిర్బంధాలు, ఇనుప కంచెలు తొలగిపోయాయని చెప్పారు. కాంగ్రెస్‌ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే రెండు అమలు చేశామన్న సీఎం కొత్త ఏడాదిలో మిగతా గ్యారంటీల అమలుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

కొత్త సంవత్సరం సందర్బంగా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఆశలతో. కొత్త కోరికలు నూతన సంవత్సరంలో ఇంటింటా ఆనందాలు, ప్రతీ కుటుంబంలో అభివృద్ధి కాంతులు వెల్లి విరియాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రజలతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. మరోవైపు రాష్ట్ర ప్రజలకు మాజీ సీఎం కేసీఆర్ కూడా న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. నూతన ఏడాది ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని కేసీఆర్ ఆకాంక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news