Saindhav Movie : సెన్సార్ పూర్తి చేసుకున్న వెంకటేష్ ‘సైంధవ్’.. ర‌న్ టైం ఎంతంటే.?

-

హిట్ ఫేమ్ శైలేష్ కోలన్ దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్. వెంకట్ బోయిన్పల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇది వెంకటేష్ కు 75వ సినిమా కావడం విశేషం. ఆయన కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన పోస్టర్స్, టీజర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న తెలుగు ,తమిళం ,కన్నడం మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ చిత్రం యొక్క సెన్సార్ పనులు పూర్తి అయినాయి.

 

2 గంటల 15 నిమిషాల రన్‌టైమ్‌తో వస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇందులో జెర్సీ ఫిలిం శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుంది.నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news